మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

Narmada Ashtakam – నర్మదాష్టకం


సబిందుసింధుసుస్ఖలత్తరంగభంగరంజితం
ద్విషత్సు పాపజాతజాతకాదివారిసంయుతమ్ |
కృతాంతదూతకాలభూతభీతిహారివర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 1 ||

త్వదంబులీనదీనమీనదివ్యసంప్రదాయకం
కలౌ మలౌఘభారహారిసర్వతీర్థనాయకమ్ |
సుమచ్ఛకచ్ఛనక్రచక్రవాకచక్రశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 2 ||

మహాగభీరనీరపూరపాపధూతభూతలం
ధ్వనత్సమస్తపాతకారిదారితాపదాచలమ్ |
జగల్లయే మహాభయే మృకండుసూనుహర్మ్యదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 3 ||

గతం తదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా
మృకండుసూనుశౌనకాసురారిసేవితం సదా |
పునర్భవాబ్ధిజన్మజం భవాబ్ధిదుఃఖవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 4 ||

అలక్ష్యలక్షకిన్నరామరాసురాదిపూజితం
సులక్షనీరతీరధీరపక్షిలక్షకూజితమ్ |
వసిష్ఠశిష్టపిప్పలాదికర్దమాదిశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 5 ||

సనత్కుమారనాచికేతకశ్యపాత్రిషట్పదై-
-ర్ధృతం స్వకీయమానసేషు నారదాదిషట్పదైః |
రవీందురంతిదేవదేవరాజకర్మశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 6 ||

అలక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం
తతస్తు జీవజంతుతంతుభుక్తిముక్తిదాయకమ్ |
విరించివిష్ణుశంకరస్వకీయధామవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 7 ||

అహో ధృతం స్వనం శ్రుతం మహేశికేశజాతటే
కిరాతసూతబాడబేషు పండితే శఠే నటే |
దురంతపాపతాపహారి సర్వజంతుశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 8 ||

ఇదం తు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా
పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా |
సులభ్యదేహదుర్లభం మహేశధామగౌరవం
పునర్భవా నరా న వై విలోకయంతి రౌరవమ్ || 9 ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ నర్మదాష్టకం సంపూర్ణమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.